నాగ చైతన్య సరసన నటించేది ఈ భామేనా?

నాగ చైతన్య సరసన నటించేది ఈ భామేనా?
నాగ చైతన్య సరసన నటించేది ఈ భామేనా?

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. 2019లో మజిలీ, వెంకీ మామ సినిమాలతో సూపర్ హిట్స్ సాధించాడు నాగ చైతన్య. ఆ తర్వాత లవ్ స్టోరీ చిత్రంలో నటించాడు. ఈ సినిమా గతేడాది ఏప్రిల్ లోనే విడుదల కావాల్సింది కానీ కరోనా ప్రభావం కారణంగా విడుదల ఆలస్యమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు బివిఎస్ రవి కథ అందించగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అవికా గోర్ ను హీరోయిన్ గా పరిశీలిస్తున్నారట. అవికా గోర్ కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. మరి ఈ నేపథ్యంలో సినిమా అంటే అది కచ్చితంగా ఆమెకు బంపర్ ఆఫర్ వంటిదే.