“రాజుగారి గది-3” లోకి ప్రవేశిస్తున్న అవికా గోర్!!


avika gor
avika gor

బుల్లితెరపై తనదైన మార్క్ రియాలిటీ షోస్తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఓంకార్ తొలిప్రయత్నంగా “జీనియస్” చిత్రంతో దర్శకుడిగా మారి అద్భుతమైన విజువల్స్ తో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత “రాజుగారి గది” సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ సాధించాడు. ఈ సీరీస్ లో భాగంగా కింగ్ నాగార్జున, సమంతలతో రాజుగారి గది-2 చేసాడు. ఈ చిత్రం ఆశించనంతగా హిట్ అవలేదు. అయినా మంచి కలెక్షన్స్ రాబట్టింది.

ఇప్పుడు ఓంకార్ “రాజుగారి గది-3” చేస్తున్నాడు. ఓంకార్. ఆ గదిలోకి వెళ్లడానికి హీరోయిన్లు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మొత్తానికి అవికా గౌర్ ముందుకొచ్చింది. “రాజుగారి గది-3″లో లీడ్ రోల్ పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నాను అనుకున్నారు. ఓపెనింగ్ కు కూడా హాజరైన ఆమె, ఏమైందో ఏమో కానీ ఓంకార్ అన్నయ్యకు హ్యాండ్ ఇచ్చింది. తర్వాత కాజల్ ని సంప్రదించారు. కానీ కాజల్ కూడా చాకచక్యంగా హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత నందిత శ్వేత, తాప్సి లాంటి పేర్లు కూడా తెరపైకి వచ్చినప్పటికీ ఓంకార్ “గది”లోకి వెళ్లేందుకు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. చివరికి అవికా గౌర్ అందుకు ఒప్పుకుంది. దీనిపై చిత్ర యూనిట్ అఫీషియల్ గా త్వరల్ స్పందించనుంది. కొన్ని కారణాల వల్ల దాదాపు టాలీవుడ్ మొత్తం ఈమెను అన్-అఫీషియల్ గా బ్యాన్ చేసింది. అందుకే ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, ‘లక్ష్మీరావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మామ’ లాంటి సినిమాలు హిట్ అయినప్పటికీ అవికాకు మళ్లీ అవకాశాలు రాలేదు. అవికా ఎవరు ఛాన్స్ ఇస్తారా అని ఎదురుచూస్తోంది. ఇంతలో ఎట్టకేలకు ఓంకార్ ఈమెకు ఓ అవకాశం ఇచ్చాడు. దీంతో అవికా గోర్ తెగ ఆనందపడుతోంది!!