అవికా గోర్‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌!


 

Avika gor team up with Kalyan dev
Avika gor team up with Kalyan dev

అవికా గోర్‌కు తెలుగులో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. మూడేళ్ల క్రితం నిఖిల్ న‌టించిన చిత్రం `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`. ఇందులో అవికా గోర్ ఘోస్ట్‌గా న‌టించిన ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత క‌నిపించ‌కుండా పోయిన అవిక దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత ఓంకార్ తెర‌కెక్కించిన  థ్రిల్ల‌ర్ `రాజుగారి గ‌ది 3` ద్వారా మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఫ‌ర‌వాలేద‌నిపించ‌డంతో తెలుగు చిత్రాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది.

గత కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చిన అవికా బుల్లి తెర‌పై రియాలీటీ షోల్లో మెరిసింది. మ‌ళ్లీ ఓంకార్ కార‌ణంగా తెలుగు తెరకు రీఎంట్రీ ఇచ్చిన అవికాకు వ‌రుస ఆఫ‌ర్లు ప‌ల‌క‌రిస్తున్నాయి. తాజాగా అవికా గోర్‌కు ఓ బంప‌ర్ అఫ‌ర్ ల‌భించిన‌ట్టు తెలిసింది. మెగాస్టార్ చిన్న‌ల్లుడు క‌ల్యాణ్‌దేవ్ `విజేత‌`సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ మూవీ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌డంతో మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు.

ఈ చిత్రానికి రైట‌ర్ శ్రీ‌ధ‌ర్ సీపాన దర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. జీఏ2, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. వైజాగ్‌లో ఈ చిత్రం ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో  ప్రారంభం కాబోతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ద‌ర్శ‌కుడు అవికా గోర్‌ని ఇటీవ‌లే సంప్ర‌దించార‌ని, స్టోరీ, క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో అవికా ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.