ఆ చిత్ర సీక్వెల్ కు నిర్మాత కావలెను!


ఆ చిత్ర సీక్వెల్ కు నిర్మాత కావలెను!
ఆ చిత్ర సీక్వెల్ కు నిర్మాత కావలెను!

న్యాచురల్ స్టార్ నాని పూర్తి స్థాయి నిర్మాతగా మారి చేసిన సినిమా అ!. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. చాలా విభిన్న కాన్సెప్ట్ తో అంతే విభిన్నంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు అప్పట్లో బజ్ బాగా నడిచింది. షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన ప్రశాంత్ వర్మ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ప్రశాంత్ వర్మ టాలెంట్ గురించి అప్పట్లో చాలా టాక్ నడిచింది. ఇంత విభిన్న కాన్సెప్ట్ టాలీవుడ్ లో వచ్చి వేస్ట్ అయిపోయింది, అదే హాలీవుడ్ లో వస్తే బెస్ట్ సినిమా, ఆస్కార్ రేంజ్ అని పొగుడుతారు అంటూ అ! చిత్రానికి అభిమానులుగా మారిన వాళ్ళు కామెంట్స్ చేసారు. సినిమాకు రేటింగ్స్, ఆడియన్స్ పరంగా రెస్పాన్స్ ఇవన్నీ పక్కనపెడితే కమర్షియల్ గా ఈ సినిమా వర్కౌట్ అయిందనే అనుకున్నారంతా. అయితే అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఏమోనన్న సందేహాలు కలుగుతున్నాయి.

ఇటీవలే ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్ ఫ్లిక్స్, అ! సినిమా గురించి ట్వీట్ చేసింది. ఈ సినిమా అదిరిపోయిందన్న రేంజ్ లో పొగిడింది. దాని కింద కామెంట్స్ లో అ!2 ఎప్పుడంటూ కొంత మంది అభిమానులు చేరి దర్శకుడు ప్రశాంత్ వర్మను అడగడం మొదలుపెట్టారు. సాధారణంగా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేనప్పుడు కామ్ గా ఉంటారు. కానీ ప్రశాంత్ వర్మ స్పందించాడు. ఈ సినిమా విషయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

అ!2 చిత్ర సీక్వెల్ స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని, ఏడాదికి కిందటే దాని పనులు అయిపోయాయని, చాలా క్రేజిగా స్క్రిప్ట్ వచ్చిందని, మొదటి భాగం కంటే చాలా విభిన్నంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పాడు. అయితే ఈ చిత్రానికి నిర్మాత దొరకట్లేదని తెలిపాడు. నిర్మాత కోసం తాను చాలా ప్రయత్నించానని, ఇక ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నట్లు తెలిపాడు.

దాంతో అందరూ నానిని ట్యాగ్ చేసి ఈ సినిమాను నిర్మించాలని కోరడం మొదలుపెట్టారు. మొదటి భాగం హిట్ అయితే ఆటోమేటిగ్గా నానినే ముందుకు వస్తాడుగా. ఇక అ!2 పట్టాలెక్కడం దాదాపు అసాధ్యం అనుకోవాలేమో.