ఆ సినిమానే ఆడలేదు కానీ సీక్వెల్ చేస్తారట


Awe sequel on cards
Awe sequel on cards

యువ దర్శకులు ప్రశాంత్ వర్మ తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ” అ ” . హీరో నాని నిర్మించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కట్ చేస్తే ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడట దర్శకులు ప్రశాంత్ వర్మ . అసలు ఆ సినిమానే ఆడలేదు కానీ దానికి సీక్వెల్ చేయడం ఏంటో ? అని ఆశ్చర్య పోతున్నారు ఇది తెలిసిన వాళ్ళు .

ఇక ఈ సీక్వెల్ సినిమాలో నటించడానికి మాత్రమే కాదు అవసరమైతే నిర్మించడానికి కూడా సిద్ధమని అంటోందట కాజల్ అగర్వాల్ . ఇక ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారట . అ చిత్రానికి ప్రశంసలు మాత్రమే దక్కాయి అలాగే ఏ సెంటర్ ప్రేక్షకులకే అంతగా ఆ ట్విస్ట్ లు అర్ధం కాలేదు ఇక బిసి కేంద్రాల గురించి చెప్పేదేముంది . ఇప్పుడు దానికి సీక్వెల్ అంటేనే షాక్ అవుతున్నారు .