అ! సీక్వెల్ ట్విస్ట్స్ సినిమాను తలపిస్తున్నాయిగా


అ! సీక్వెల్ ట్విస్ట్స్ సినిమాను తలపిస్తున్నాయిగా
అ! సీక్వెల్ ట్విస్ట్స్ సినిమాను తలపిస్తున్నాయిగా

అ! అనే విభిన్న చిత్రంతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ వర్మ. అప్పటిదాకా షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే చేసిన అనుభవమున్నా అ! ను ఒక భిన్నమైన చిత్రంగా నిలపడంలో సక్సెస్ అయ్యాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ ను ఫిల్మ్ గా తీయడం ఒక సాహసమే. అందుకే ఈ చిత్రాన్ని నిర్మించిన నానికి బోలెడన్ని ప్రశంసలు దక్కాయి. విఎఫ్ఎక్స్, మేకప్ విభాగంలో నేషనల్ అవార్డులు సైతం అందుకుంది ఈ చిత్రం. అయితే ఫైనాన్షియల్ గా ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదనే టాక్ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా సీక్వెల్ గురించి టాక్ బయట బాగా నడుస్తోంది. నిజానికి అ! రిలీజ్ అప్పుడే సీక్వెల్ ఉంటుందన్న టాక్ నడిచింది కానీ ఎందుకనో అది వార్త గానే మిగిలిపోయింది. మళ్ళీ ఇన్నాళ్టికి ఈ సినిమా గురించిన వార్తలు బయటకు వస్తున్నాయి.

రీసెంట్ గా ప్రశాంత్ వర్మ స్పందిస్తూ అ! సీక్వెల్ స్క్రిప్ట్ ను పూర్తి చేసి ఏడాది దాటుతోందని, అయితే ఈ చిత్ర కథంత క్రేజీగా ఆలోచించే నిర్మాత దొరకనందు వల్ల సినిమా చేయలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు. ఈ వార్తల్లోకి నానిని లాగడం కూడా జరిగింది. అయితే ప్రశాంత్ వర్మ తర్వాత క్లారిటీ ఇచ్చి నానికి ఈ సీక్వెల్ కు సంబంధం లేదని, తాను అసలు నానిని సంప్రదించలేదని తెలియజేసాడు.

ఈ కథ ఇలా ముగిసింది అనేలోగా మరో ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అ! సీక్వెల్ ఉంటుందని, త్వరలోనే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయి అని తెలియజేసాడు. అయితే ప్రస్తుతం తనకు కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయని, అవి అవ్వగానే అ! సీక్వెల్ మొదలవుతుందని చెప్పాడు. అ! సినిమా తర్వాత రాజశేఖర్ తో కల్కి సినిమా చేసాడు ప్రశాంత్ వర్మ. అయితే ఆ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విభిన్నంగా ఆలోచించగలిగే ఈ దర్శకుడు, జనాలకు చేరువయ్యే సినిమాలు తీస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. మరి ఆ దిశగా ఏదైనా జరుగుతుందేమో చూద్దాం.