ఒక్క షాట్ ఇప్పుడు సెన్సేషన్ అయింది!


ఒక్క షాట్ ఇప్పుడు సెన్సేషన్ అయింది!
ఒక్క షాట్ ఇప్పుడు సెన్సేషన్ అయింది!

సినిమాలకు హైప్ రావడానికి చాలానే కారణాలు ఉంటాయి. ఒక్కో సినిమాకు టీజర్ వల్ల, ఒక్కో దానికి అందులో నటించే నటీనటుల వల్ల, మరో సినిమాకు థియేట్రికల్ ట్రైలర్ వల్ల, కొన్నిటికి పాటల వల్ల ఇలా చాలా కారణాలు ఉండొచ్చు. అయితే ఇప్పుడు నాగ చైతన్య నటిస్తోన్న లవ్ స్టోరీ సినిమాకు కూడా చిన్న వీడియో బిట్ వల్ల, అందులోనూ ఒక్క షాట్ వల్ల విపరీతమైన క్రేజ్ వచ్చింది.

మొన్న ప్రేమికుల రోజున లవ్ స్టోరీ చిత్రంలోని ఏ పిల్లా సాంగ్ ప్రివ్యూను విడుదల చేసారు. సాంగ్ మెలోడీగా సాగుతూ మంచి విజువల్స్ ఫీల్ కలిగించింది. మాములుగా అలా సాగిపోయి ఉంటే కిక్ ఉండేది కాదనుకున్నాడో ఏమో, వీడియో చివర్లో ఒక చిన్న సీన్ ను పెట్టారు. అందులో హీరోయిన్ గా చేస్తోన్న సాయి పల్లవి, నాగ చైతన్యను ముద్దు పెట్టుకుంటుంది. అది ఊహించని నాగ చైతన్య ఆనందంతో కళ్ళలోంచి నీళ్లు వస్తాయి. అది చూసిన సాయి పల్లవి ముద్దు పెట్టుకుంటే ఏడుస్తారా అబ్బా అంటుంది. ఈ 10 సెకెన్ల చిన్న బిట్ ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది. ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. నాగ చైతన్య యాక్టింగ్ పీక్స్ లో ఉండబోతోందని ఈ చిన్న వీడియో బిట్ ద్వారా తెలిసిందని అంటున్నారు. ఏదేమైనా ఈ వీడియోతో లవ్ స్టోరీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుతుకుంటోంది. ముందుగా ఏప్రిల్ 16న విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడు షూటింగ్ లో జాప్యం కావడం వల్ల రిలీజ్ జూన్ కు మారిందని తెలుస్తోంది. పవన్ సిహెచ్ అనే కొత్త కుర్రాడు సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న చిత్రం కావడం, నాగ చైతన్య ఆఖరి రెండు చిత్రాలు సూపర్ హిట్స్ కావడంతో లవ్ స్టోరీపై ముందునుండే అంచనాలు బాగున్నాయి. ఇప్పుడీ వీడియోతో మరింత పెరిగాయి.