మూడ‌వ అతిపెద్ద ఆల‌యంగా అమోధ్య‌!Ayodhya Ram temple to be 3rd largest hindu shrine in world
Ayodhya Ram temple to be 3rd largest hindu shrine in world

కొన్ని ద‌శాబ్దాల భారీతీయుల స్వ‌ప్నం సాక్ష్యాత్కారం కాబోతోంది. ఎన్నో ఏళ్ళ నాటి కల‌కు నేడు అంకురార్ప‌ణ జ‌ర‌గ‌బోతోంది. నేడే ఆయోధ్య రామ మందిర భూమి పూజ‌. ఈ క్ష‌ణం కోసం భారతీయులంతా ఎదురుచూస్తున్నారు. అయోధ్య‌లో ప్ర‌ధాన న‌రేంద్ర మోదీ రామ మందిరం కోసం భూమిపూజ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. ప్ర‌త్యే విమానంలో అయోధ్య‌కు ప్ర‌ధాని మోదీ బ‌య‌లుదేరి వెళ్లారు.

ప్ర‌పంచంలో ఎక్క‌డా లేన‌ట్టుగా 5 గోపురాల‌తో 69 ఎక‌రాల్లో 3 అంత‌స్థుల్లో 161 అడుగుల ఎత్తులో రామ మందిరం నిర్మితం కాబోతోంది. గ‌ర్భ గుడి వ‌ద్ద వెండితో పై క‌ప్పు ఏర్పాటు చేయ‌నుండ‌గా, ప్ర‌పంచంలోనే మూడ‌వ అతిపెద్ద ఆల‌యంగా అయోధ్య రామ మందిరం నిల‌వ‌బోతోంది. ప్ర‌స్తుతం కంబోడియాలోని అంగోక‌ర్‌వాట్ టెంపుల్ తొలి స్థానంలో నిల‌వ‌గా, త‌మిళ‌నాడు లోని తిరుచ్చిరాయిప‌ల్లిలోని రంగ‌నాథ‌స్వామి ఆల‌యం రెండ‌వ స్థానంలో నిలిచింది.

అయోధ్య రామాల‌య నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశారు. కొత్త ఆల‌యం వెడ‌ల్పు 140 అడుగుల నుంచి 270, 280 అడుగుల‌కు, పొడ‌వు 268 నుండి 280 – 300 అడుగుల‌కు, ఎత్తు 128 అడుగుల నుంచి 161 అడుగుల‌కు పెరిగే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.