అయోధ్య లో నిర్మించే ఆలయ నమూనా విశేషాలు


అయోధ్య లో నిర్మించే ఆలయ నమూనా విశేషాలు
అయోధ్య లో నిర్మించే ఆలయ నమూనా విశేషాలు

చరిత్రలో నిలిచే విధంగా అయోధ్య లో శ్రీ రామ దేవాలయం నిర్మించేందుకు రంగం సిద్దం అయ్యింది. అయోధ్య కేసులో తీర్పు వచ్చిన వెంటనే యావత్ దేశం మొత్తం, అయోధ్యలో నిర్మించే ఆలయం యొక్క నమూనా, డిజైన్ ఎలా ఉంటే బాగుటుంది, అన్న అంశం పై చర్చిస్తూ, పలు రకాల సూచనలు ఇస్తున్నారు. అయితే విశేషం ఏంటంటే, అయోధ్య లో నిర్మించే ఆలయం ఎలా ఉండాలో సుమారు ౩౦ ఏళ్ళ క్రితం అంటే 1989 లో చంద్రకాంత్ సోంపూరా అనే ఒక శిల్పి రూపకల్పన చేసారు. అప్పటి విశ్వ హిందూ పరిషత్ చీఫ్ శ్రీ అశోక్ సింఘాల్ గారి విజ్ఞప్తి మేరకు చంద్ర కాంత్ ఆలయ నమూనా తయారు చేసారు.

తర్వాత 1990 జరిగిన అలాహాబాద్ కుంభమేళా సమయంలో సాధువులు ఆ నమూనా చూసి అంగీకారం తెలపగా, అప్పటినుండి అనేక మంది శిల్పుల సహయంతో ఆలయానికి సంబంధించిన శిల్పాలు, రాతి కట్టడాలు తయారు చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటకే దాదాపు 40 శాతం పని పూర్తి అయ్యిందని, ఆలయ నిర్మాణానికి సుమారు రెండున్నరేళ్ళ సమయం పడుతుంది అని, ట్రస్ట్ ఏర్పాటు అయిన తరువాత వనరుల సమీకరణ తదితర అంశాలకు 3 నుండి 6 నెలల సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రకాంత్ సొంపురా గారి కుటుంబం తరతరాలుగా దేవాలయాలు రూపకల్పన చేసే బాధ్యత లోనే కొనసాగుతున్నారు. వారి తండ్రి ప్రభాకర్ సోంపూరా గారు, మన దేశంలో ప్రఖ్యాతి గాంచిన గుజారాత్ సోమనాద్ ఆలయానికి, మధుర లో ఉన్న శ్రీ కృష్ణ ఆలయానికి డిజైన్ లు అందించారు. చంద్రకాంత్ గారు గుజారత్ లో ఉన్న స్వామీ నారాయణ మందిర్ సహా, దేశ, విదేశాలలో సుమారు 100 కు పైగా దేవాలయాలకు రూపకల్పన చేసారు. వచ్చే ఏడాది శ్రీ రామ నవమి నాటికి అయోధ్య ఆలయ పనులు మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.