బాహుబలి 2 జపాన్ లో 100 డేస్ పూర్తిచేసుకుంది


బాహుబలి 2 జపాన్యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు చిత్రం బాహుబలి 2 . కాగా తాజాగా ఈ చిత్రం జపాన్ లో కూడా వంద రోజుల ను పూర్తిచేసుకుని అక్కడ కూడా ప్రభంజనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 1600 కోట్ల కు పైగా వసూల్ చేసి తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటిన బాహుబలి  2 జపాన్ లో 100 రోజులు పూర్తిచేసుకోవడం విశేషమే మరి. జపాన్ లో  రజనీకాంత్ కు అనూహ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది , రజనీ తర్వాత ఎన్టీఆర్ కు అంతటి ఫాలోయింగ్ లభించింది అక్కడ.

కట్ చేస్తే ఇప్పుడు బాహుబలి పుణ్యమా అని ప్రభాస్ కు కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్  యాక్షన్ కు జపాన్  ఫ్యాన్స్  బ్రహ్మరథం పడుతున్నారు. బాహుబలి 2 లో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. జపాన్ లో తమ చిత్రం వంద రోజులను పూర్తిచేసుకోవడంతో ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడానికి బాహుబలి అఫీషియల్ పేజీలో పోస్ట్ చేసారు. ఇక ఇక్కడి అభిమానులు కూడా ప్రభాస్ సినిమా జపాన్ లో కూడా సూపర్ హిట్ కావడంతో చాలా సంతోషంగా ఉన్నారు.