జపాన్ లో 100 డేస్ పూర్తిచేసుకున్న బాహుబలి 2


Baahubali 2 crosses 100 days in Japanతెలుగునాట మాత్రమే కాకుండా ఓవర్ సీస్ లో సైతం ప్రభంజనం సృష్టించిన బాహుబలి 2 తాజాగా జపాన్ లో విడుదలై అక్కడ కూడా వంద రోజులను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . ఈ విషయాన్నీ బాహుబలి నిర్మాత స్వయంగా ట్వీట్ చేయడం విశేషం . ప్రభాస్ ని సూపర్ స్టార్ ని చేసిన చిత్రం బాహుబలి . అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ కు మరింత గుర్తింపు తెచ్చిన బాహుబలి సంచలనం సృష్టించగా బాహుబలి 2 కూడా ప్రభంజనం సృష్టించింది .

జపాన్ లో రజనీకాంత్ కు మాత్రమే విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడగా ఎన్టీఆర్ చిత్రాలకు కూడా కాస్త ఆదరణ తోడయ్యింది ఇక ఇప్పుడేమో ప్రభాస్ కు దాంతో ప్రభాస్ తో పాటుగా బాహుబలి యూనిట్ కూడా చాలా సంతోషంగా ఉంది .ఇక ఇప్పుడు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ – చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు మరి ఈ చిత్రం ఎలాంటి సంచలనాలను సృస్టించనుందో చూడాలి .