బాహుబలి ప్రీక్వెల్ దర్శకుడు దేవ కట్టానా


baahubali prequel director deva kattaబాహుబలి , బాహుబలి 2 చిత్రాలు ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే . తెలుగు చిత్రానికి జాతీయ స్థాయిలో , అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ని తెచ్చిపెట్టాయి ఆ చిత్రాలు కాగా ఇపుడు ఆ చిత్రాలకు ఫ్రీక్వెల్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా అధినేతలు . బాహుబలి ఫ్రీక్వెల్ అంటే శివగామి చిన్నప్పటి నుండి ఉంటుందట అయితే ఇది సినిమా కాదు వెబ్ సిరీస్ . యు ట్యూబ్ కోసం చేస్తున్న సినిమా దాంతో బాహుబలి రేంజ్ లో కాకుండా యు ట్యూబ్ రేంజ్ లోనే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయట .

ఇక ఈ సిరీస్ కు దర్శకుడు దేవ కట్టా . తెలుగు , తమిళ్ , హిందీ బాషలలో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ లకు ఒక్కో భాషలో ఒక్కో దర్శకుడిని ఎంచుకున్నారు . తెలుగు వెబ్ సిరీస్ కు దేవ కట్టా దర్శకుడు . బాహుబలి సిరీస్ లలో వచ్చిన రెండు చిత్రాలకు కూడా దేవ కట్టా స్క్రిప్ట్ వర్క్ సైడ్ పనిచేసాడు . దాంతో ఈ వెబ్ సిరీస్ కి చాన్స్ ఇచ్చారు ఆర్కా మీడియా అధినేతలు . దేవ కట్టా దర్శకత్వంలో ఇంతకుముందు వెన్నెల , ప్రస్థానం , ఆటోనగర్ సూర్య చిత్రాలు వచ్చాయి అయితే కొన్ని చిత్రాలు డిజాస్టర్ కావడంతో దర్శకుడిగా ప్రాభవం కోల్పోయాడు . ఇక ఇప్పుడేమో బాహుబలి ఫ్రీక్వెల్ చేస్తున్నాడు దీనితో దేవ కట్టా సత్తా చాటుతాడా చూడాలి .