బాహుబలి కథ ఎలా పుట్టిందో తెలుసా ?

Baahubali
Baahubali

బాహుబలి కథ ఎలా పుట్టిందో తెలుసా ……. హీరో ప్రభాస్ కులం రాజుల కులం అన్న విషయం తెలిసిందే . ప్రభాస్ రాజుల కులం కావడంతో రాజుల నేపథ్యంలో కథ రాయమని దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి చెప్పాడట దాంతో కథకుడు విజయేంద్ర ప్రసాద్ రాజుల కథ రాసాడట అదే బాహుబలి గా ప్రభంజనం సృష్టించింది . తాజాగా ఈ విషయాన్నీ గురించి వెల్లడించాడు రచయిత విజయేంద్రప్రసాద్ .

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో , ఈనెల 30 న భారీ ఎత్తున విడుదల కానుంది . ఇక ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ గొప్పతనం గురించి చెబుతూ బాహుబలి కథ పుట్టుక గురించి కూడా చెప్పాడు విజయేంద్రప్రసాద్ . బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో సాహో పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . మరి ఈ సాహో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే ఈనెల 30 వరకు ఎదురు చూడాల్సిందే . ప్రభాస్ సరసన శ్రద్దాకపూర్ నటించగా సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సాహో చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది .