ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్న అల్లు అర్జున్


 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులకు షాక్ ఇస్తున్నాడు . ఇప్పటికే అల్లు అర్జున్ సినిమా లేక ఏడాది పూర్తయ్యింది ఇక ఇపుడు ప్రారంభమైన త్రివిక్రమ్ సినిమా దసరా కానుకగా రిలీజ్ అవుతుందనుకుంటే దాన్ని కూడా వాయిదా వేస్తున్నాడు . ఈ ఏడాది ఇక అల్లు అర్జున్ సినిమా లేనట్లే ! ఎందుకంటే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రాన్ని దసరా కు కాకుండా సంక్రాంతి కి విడుదల చేయాలనీ చూస్తున్నారు .

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా డిజాస్టర్ అయ్యింది . ఆ సినిమా తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ సినిమానే రాలేదు . ఇక ఇప్పడు ఈ సినిమా వస్తోందనుకుంటే ఇది కాస్త సైరా నరసింహ రెడ్డి చిత్రం కోసం వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారట . అయినా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల సినిమా ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తిచేసుకుంది దాంతో అది కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అయ్యేసరికి డిసెంబర్ అవుతుంది కాబట్టి జనవరి 2020 లో విడుదల చేయాలనీ భావిస్తున్నాడట ఈ హీరో . దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి .