ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్

bad news for ntr fansయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్ , అరవింద సమేత వీర రాఘవ చిత్ర ఆడియో వేడుక ఈనెల 20న అంగరంగ వైభవంగా నిర్వహించాలని అనుకున్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అరవింద సమేత వీర రాఘవ ఆడియో వేడుక రద్దు అయ్యింది . నందమూరి అభిమానుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , నందమూరి బాలకృష్ణ ముఖ్య అథితులుగా అరవింద సమేత ఆడియో వేడుక చేయాలనీ అనుకున్నారు కానీ హరికృష్ణ చనిపోయి ఇంకా దుఃఖసాగరంలోనే ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిద్దామని ఆడియో వేడుకని రద్దు చేశారట .

అయితే ప్రీ రిలీజ్ వేడుక మాత్రం ఆంధ్రప్రదేశ్ లో నందమూరి అభిమానులతో పాటుగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పాల్గొనెలా భారీ వేడుక నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే ఇది ఈనెలలో కాదు అక్టోబర్ మొదటి వారంలో ప్రీ రిలీజ్ వేడుక చేయనున్నారు . ఈ వేడుకకు చంద్రబాబు నాయుడు తో పాటుగా బాలకృష్ణ కూడా పాల్గొననున్నాడు .ఎన్టీఆర్ ని ఆ ఇద్దరితో కలిపి చూస్తే నందమూరి అభిమానుల కిక్కే వేరుగా ఉంటుంది . ఇక అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని అక్టోబర్ 11 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: bad news for ntr fans