పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్


Pawan Kalyan
Pawan Kalyan

తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు పవన్ కళ్యాణ్ . జనసేన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తాడని , నటిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు అయితే వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లాడు పవన్ . నేను మళ్ళీ సినిమాల్లోకి రావడం లేదు , నా దృష్టి అంతా రాజకీయాల మీదనే ! నేను ఏంటో…… నా సత్తా ఏంటో అక్టోబర్ నుండి చూపిస్తా ! అంటూ సవాల్ విసిరాడు పవన్ .

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు కోసం జాతీయ పార్టీల నుండి ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం తహతహలాడాయి అయితే నేను ఒంటరిగానే పోటీ చేయాలనే నిర్ణయంతో ఒంటరి పోరాటం చేశాను , ఓడిపోయినంత మాత్రాన భయపడి పారిపోయే రకం కాదు రాబోయే రోజుల్లో నేనేంటో చూపిస్తా అంటూ ఆవేశంగా చెబుతున్నాడు పవన్ .