`ఎఫ్‌3`లో బాల‌య్య హీరోయిన్‌?

`ఎఫ్‌3`లో బాల‌య్య హీరోయిన్‌?
`ఎఫ్‌3`లో బాల‌య్య హీరోయిన్‌?

విక్ట‌రీ వెంక‌టేష్, వ‌రుణ్‌తేజ్‌ హీరోలుగా, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్‌లుగా న‌టించిన చిత్రం `ఎఫ్‌2`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్  వంద కోట్లు వ‌సూలు చేసి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి ప్ర‌స్తుతం సీక్వెల్‌గా `ఎఫ్‌3` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. `ఎఫ్‌2` టీమ్ అంతా మ‌ళ్లీ న‌టించిన ఈ మూవీ డ‌బ్బు వ‌ల్ల వ‌చ్చే ఫ్ర‌స్ట్రేష‌న్ నేప‌థ్యంలో మ‌రింత హిలేరియ‌స్‌గా వుంటుంద‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి చెబుతున్నారు. `ఎఫ్‌2` మించి `ఎఫ్‌3`ని తీర్చి దిద్దే క్ర‌మంలో ఈ చిత్రంలో మ‌రింత ఎట్రాక్టీవ్‌గా వుండే కాస్టింగ్‌ని జ‌త చేస్తున్నార‌ట‌.

ఫ్యామిలీస్‌కి ఎంట‌ర్‌టైన్‌ని అందిస్తూనే `ఎఫ్‌3`ని మ‌రింత హీటెక్కించాల‌నే ప్లాన్‌లో వున్నార‌ట అనిల్ రావిపూడి. ఈ మూవీ కోసం బాల‌య్య హీరోయిన్ హాట్ బేబీ ‌సోనాల్ చౌహాన్‌ని మ‌రో హీరోయిన్‌గాఎంపిక చేశార‌ట‌. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్ శివారులో జ‌రుగుతోంది. సోనాల్ చౌహాన్ త్వ‌ర‌లోనే షూట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని తెలిసింది.