బాలకృష్ణ 105.. రామోజీలో షూటింగ్


Balakrishna
బాలకృష్ణ 105.. రామోజీలో షూటింగ్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన బాలకృష్ణ లుక్ ను ఇటీవలే విడుదల చేయగా దానికి అదిరిపోయే స్పందన వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రాల్లో బాలయ్య రెండు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ రేపటి నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుకానుంది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.