బాలయ్య సినిమా మరింత ముందుకు రానుందా?


బాలయ్య సినిమా మరింత ముందుకు రానుందా?
బాలయ్య సినిమా మరింత ముందుకు రానుందా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 105వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అసలు సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే సంక్రాంతికి ఇప్పటికే నాలుగు చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉండడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

దీంతో బాలయ్య సినిమా రిలీజ్ ను ముందుకు జరపాలని నిశ్చయించుకున్నారు. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే క్రిస్మస్ కు కూడా మూడు నుండి నాలుగు సినిమాలు రిలీజ్ కోసం చూస్తున్నాయి. మరి బాలయ్య సినిమా సంగతి ఏం తెలుస్తారో చూడాలి.

రూలర్ గా టైటిల్ ను పరిగణిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. భూమిక ఒక కీలక పాత్రలో మెరవనుంది. కెఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో తెలుస్తుంది.