బాల‌య్య‌తో బోయ‌పాటి శ్రీ‌ను సాహ‌సం!


బాల‌య్య‌తో బోయ‌పాటి శ్రీ‌ను సాహ‌సం!
బాల‌య్య‌తో బోయ‌పాటి శ్రీ‌ను సాహ‌సం!

హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో బోయ‌పాటి శ్రీ‌ను సాహ‌సం చేయిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌నుల క‌ల‌యిక‌లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో బాల‌కృష్ణ‌ని అఘోరాగా చూపించ‌బోఉన్నార‌ని, వార‌ణాసి నేప‌థ్యంతో వ‌చ్చే ఏపిసోడ్‌లో బాల‌య్య అఘోరాగా క‌నిపిస్తార‌ని గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

అయితే ఆ వార్త‌లు నిజ‌మేన‌ని తాజాగా బ‌య‌ట‌ప‌డింది. రెండు విభిన్న‌మైన గెట‌ప్‌ల‌లో బాల‌య్య ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నారని. అఘోరా పాత్ర కోసం ఆయ‌న గుండు చేయించుకున్నార‌ని. తొలి సారి సినిమాలో గుండుతోనే బాల‌య్య క‌నిపించ‌నున్నార‌ని తెలిసింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండ‌వ భాగం `మ‌హానాయ‌కుడు`లో వ‌చ్చే అసెంబ్లీ స‌న్నివేశంలో బాల‌య్య గుండుతో క‌నిపించి షాకిచ్చారు. తాజాగా బోయ‌పాటి సినిమా కోసం గుండుతో అఘోరాగా క‌నిపించ‌బోతుండ‌టంతో ఫ్యాన్స్ షాక్‌కు గుర‌వుతున్నార‌ట‌.

ఈ సినిమా తొలి షెడ్యూల్ వార‌ణాసిలో మొద‌లుకాబోతోంది. బాల‌య్య‌కు సంబంధించిన ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌రిస్తార‌ట‌. ఈ స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇందులో బాల‌య్య‌కు జోడీగా న‌య‌న‌తార‌. శ్రియ న‌టించ‌బోతున్నారు.