`అఖండ‌` అప్పుడే రికార్డుల మోత మొద‌లైంది!

`అఖండ‌` అప్పుడే రికార్డుల మోత మొద‌లైంది!
`అఖండ‌` అప్పుడే రికార్డుల మోత మొద‌లైంది!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ఊర మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ రూపొందుతున్న వియం తెలిసిందే. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌గ్యాజైస్వాల్‌, పూర్ణ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గురించి గ‌త కొన్నిరోజులుగా ర‌క‌ర‌కాల టైటిల్స్ వినిపించాయి. అయితే ఉగాది సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు టీజ‌ర్‌ని కూడా మేక‌ర్స్ రిలీజ్ చేసి బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

గ‌త కొన్ని నెల‌లుగా మేక‌ర్స్ స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తూ వ‌చ్చిన ఈ మూవీ టైటిల్‌ని, టీజ‌ర్‌ని ప్ర‌క‌టించేశారు. బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నఈ చిత్రానికి `అఖండ‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ఇందులో ఓ పాత్ర‌లో బాల‌య్య అఘోరాగా క‌నిపించ‌బోతున్నారు. అందుకు సంబంధించిన విజువ‌ల్స్‌తో టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. బుధ‌వారం విడుద‌ల చేసిన ఈ మూవీ టీజ‌ర్ 24 గంట‌లు తిర‌క్కుండానే 10 మిలియ‌న్‌ల‌కు మించి వ్యూస్‌ని రాబ‌ట్టి టాప్ వ‌న్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండ‌టం గ‌మ‌నార్హం.

బోయ‌పాటి శ్రీ‌ను, బాల‌కృష్ణ‌ల కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌రకు సింహా, లెజెండ్ వంటి  బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాలొచ్చాయి. ఈ రెండింటి త‌రువాత వ‌స్తున్న మూడ‌వ చిత్రిమి‌ది. హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 28న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్‌కి ముందే టీజ‌ర్‌తో రికార్డుల మోత మొదలుపెట్టిన బాల‌య్య మే 28న ఏ స్థాయి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తారో చూడాలి.