బోయ‌పాటి ఫైన‌ల్‌గా ఆ టైటిల్‌కే ఫిక్స‌య్యారా?

 

balakrishna and boyapati movie title finalized
balakrishna and boyapati movie title finalized

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌నుల కాంబినేష‌న్‌లో సినిమా అంటే మాస్ ఆడియ‌న్స్‌తో పాటు నంద‌మూరి అభిమానుల్లో ఆ సినిమాకుండే క్రేజే వేరు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సింహా, లెజెండ్ చిత్రాలొచ్చాయి. ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మూడ‌వ చిత్రం రూపొందుతోంది. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

`బీబీ3` అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో టైటిల్స్ వినిపించాయి. అయితే ఈ చిత్రానికి `గాడ్‌ఫాద‌ర్‌` అనే టైటిల్‌ని బోయ‌పాటి శ్రీ‌ను ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ మూవీ కోసం ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ని వెతుకుతున్న బోయ‌పాటి ఫైన‌ల్‌గా `గాడ్ ఫాద‌ర్‌` టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది.

త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని అధికారికంగా మేక‌ర్స్ వెల్ల‌డించ‌బోతున్నార‌ట‌. ఇందులో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఓ పాత్ర‌లో క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టీజ‌ర్, బాల‌య్య చెప్పిన డైలాగ్స్ విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మే 28న విడుద‌ల కానుంది.