బాల‌య్య సినిమాకు బ‌డ్జెట్‌ కటింగ్ మొద‌లైందా?బాల‌య్య సినిమాకు బ‌డ్జెట్‌ కటింగ్ మొద‌లైందా?
బాల‌య్య సినిమాకు బ‌డ్జెట్‌ కటింగ్ మొద‌లైందా?

స్టార్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ చిత్రానికి బ‌డ్జెట్ క‌టింగ్ మొద‌లైందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. సింహా, లెజెండ్ చిత్రాల త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను – నంద‌మూరి బాల‌కృష్ణ‌ల క‌ల‌యిక‌లో ముచ్చ‌ట‌గా మూడ‌వ చిత్రం తెర‌పైకి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన బీబీ3 ఫ‌స్ట్ రోర్ ఈ మూవీపై అంచ‌నాల్ని పెంచేసింది.

ఇందులో హీరో బాల‌కృష్ణ మాసీవ్ పాత్ర‌తో పాటు అఘోరాగా రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ని ఛేజింగ్ సీన్‌ని పూర్తి చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఓ వార్త ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముందు ఈ చిత్రానికి 80 కోట్లు బ‌డ్జెట్ ని కేటాయించార‌ట‌. అయితే తాజా ప‌రిస్థితుల నేప్యంలో ఆ బ‌డ్జెట్‌ని స‌గానికి స‌గం త‌గ్గించి 40 కోట్ల‌కు కుదించార‌ని ఇండ‌స్ట్రీ టాక్‌.

హీరో బాల‌కృష్ణ‌తో పాటు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కూడా త‌న పారితోషికాన్ని త‌గ్గించుకున్నార‌ని తెలిసింది. ముందు అనుకున్న దానికి భిన్నంగా మినిమ‌మ్ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని పూర్తి చేయాల‌ని బోయ‌పాటి ప్లాన్ చేసిన‌ట్టు టాక్‌. ఇంత‌కు ముందు వార‌ణాసి షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ షెడ్యూల్‌ని హైద‌రాబాద్‌లోనే సెట్‌లో పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ విష‌యం తెలిసిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం బోయ‌పాటి కాంప్ర‌మైజ్ అవుతున్నారా అని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.