విశాఖలో టాలీవుడ్ స్టూడియోల హంగామా?


విశాఖలో టాలీవుడ్ స్టూడియోల హంగామా?
విశాఖలో టాలీవుడ్ స్టూడియోల హంగామా?

విశాఖలో ఎం జరగబోతోంది?. టాలీవుడ్ స్టార్స్ స్టూడియో ల పేరుతో పోటీ పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో స్టూడియోల నిర్మాణం చేపట్టాలని గతకొంతకాలంగా చర్చ నడుస్తోంది. కానీ ఇంతవరకు ఎలాంటి కదలిక రాలేదు.

విశాఖ కేంద్రంగా టాలీవుడ్ ని విస్తరించాలని ప్లాన్ లు చేసినా అక్కడ స్టూడియోల నిర్మాణం లేకపోవడం తో టాలీవుడ్ తరలింపు ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. రామా నాయుడు విశాఖ శివారు కొండపై స్టూడియో నిర్మించినా సరైన కార్యకలాపాలు మొదలుపెట్టలేదు.
స్టూడియోల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించమని ఇప్పటికే హీరో బాలకృష్ణ , హీరో చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ ఇద్దరిలో బాలయ్య గతంలో అడిగారని, తాజాగా ముఖ్యమంత్రి వైస్ జగన్ ని చిరంజీవి అడిగారని తెలిసింది. ఈ ఇద్దరు పోటీ పడుతుంటే వున్నస్టూడియోని  మరింత సుందరీ కరించాలని డి. సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారు. కరోనా ఉధృతి తగ్గితే స్టూడియోల నిర్మాణం ఊపందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.