బాలకృష్ణ – ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో సినిమా ?


Balakrishna and Jr Ntr and Kalyan Ram
Balakrishna and Jr Ntr and Kalyan Ram

నటసింహం నందమూరి బాలకృష్ణ అబ్బాయ్ లు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లతో కలిసి సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నాడట . అక్కినేని ఫ్యామిలీ మనం సినిమా తరహాలో భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నారట . బాలయ్య కు తోడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్  కలిస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే . ఫ్యామిలీ ఎంటర్ విత్ యాక్షన్ ఫిలిం చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారట . ఈ ఆలోచన నందమూరి కళ్యాణ్ రామ్ కు ఎప్పుడో వచ్చింది .

ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంకా సెట్ కాలేదు , అయితే కళ్యాణ్ రామ్ గట్టిగా ప్రయత్నిస్తే నందమూరి హీరోల మనం సినిమా రావచ్చు . బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ పై ఎన్నో ఆశలు పెట్టుకొని చేసాడు అయితే అది దెబ్బకొట్టింది . కానీ ఈ నందమూరి ఫ్యామిలీ చిత్రం మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం . ఇక నందమూరి అభిమానులకు ఈ వార్త మిక్కిలి సంతోషం అందించేదే .