రాయలసీమ  సింహా  గా బాలకృష్ణ!!Balakrishna
Balakrishna

నటసింహం నందమూరి బాలకృష్ణ రాయలసీమ బ్యాక్డ్రాప్ లో అచ్చిన చిత్రాలన్నీ విజయవంతం అయ్యాయి. తాజాగా ఇప్పుడు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో  మరో చిత్రాన్ని చేయబోతున్నారు. కె.ఎస్.రవికుమర్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండో వరం నుండి జరుగుతుంది.

ఈ చిత్రానికిరాయలసీమ సింహాఅంటూ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ని  రిజిస్టర్ చేయించారు నిర్మాత కళ్యాణ్. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ తో కేఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వీళిద్దరి కాంబినేషనల్ జైసింహా వచ్చిన విషయం తెలిసిందే..! ఆ చిత్రం ఓ మోస్తరు విజయం కావడంతో మళ్ళీ బాలయ్య తో సినిమా చేస్తున్నారు రవికుమార్. ఈ చిత్రంలో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహన్ ఇద్దరూ జతకట్టనున్నారు!!