మళ్ళీ తాతయ్య అయిన బాలయ్య


Balakrishna becomes Grandfather againనటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి తాతయ్య అయ్యాడు అయితే ఈసారి చిన్న కూతురు తేజస్విని తల్లి కావడంతో బాలయ్య ఇంట సంతోషం వెల్లివిరుస్తోంది . బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి కాగా రెండో కూతురు తేజస్విని . రెండో కూతురు వివాహం 2013 లో అంగరంగ వైభవంగా చేసిన విషయం తెలిసిందే . తేజస్విని పండంటి మగబిడ్డ కు జన్మనిచ్చింది , తల్లి , బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు .

బాలయ్య పెద్ద కూతురు కి కూడా కొడుకే అలాగే చిన్న కూతురు కి కూడా కొడుకే కావడంతో నందమూరి ఇంట ఆనందం తాండవిస్తోంది . బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చేయాలనీ ఉత్సాహపడుతున్నాడు . ఈనెల 29న అంగరంగ వైభవంగా ఆ సినిమా ప్రారంభం కానుంది . ఇది నందమూరి అభిమానులకు మరో సంతోషకరమైన వార్త .