బాల‌య్య హంగామా మామూలుగా లేదుగా!

బాల‌య్య హంగామా మామూలుగా లేదుగా!
బాల‌య్య హంగామా మామూలుగా లేదుగా!

నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు వేడుక‌లు మ‌రో నాలుగు రోజుల్లో జ‌ర‌గబోతున్నాయి. ఐదు రోజులు ముందుగానే హంగామా మొద‌లైంది. బాల‌య్య 60వ బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ ఏడాది బ‌ర్త్‌డేని ప్ర‌త్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. బాల‌య్య బ‌ర్త్‌డే కామ‌న్ డీపీని రెడీ చేయించి వ‌దిలారు. ఇలా బ‌ర్త్‌డేల‌కు కామ‌న్‌ డీపీల‌ని రెడీ చేయించి మ‌రో సెల‌బ్రిటీతో రిలీజ్ చేయించ‌డం ఈ మ‌ధ్య కాలంలో ఫ్యాష‌న్‌గా మారింది.

ఇదే క్ర‌మంలో బాల‌య్య బ‌ర్త్‌డే కామ‌న్ డీపీని రెడీ చేయించారు. జై బాల‌య్య అనే స్లోగ‌న్‌లు బ్యాగ్రౌండ్‌లో క‌నిపించేలా డిజైన్ చేయించారు. మ‌ధ్య‌లో `ఆదిత్య 369` చిత్రంలోని బాల‌కృష్ణ శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌ల గెట‌ప్‌ని ఒ ప‌క్క‌, `నిప్పుర‌వ్వ‌` చిత్రంలోని బాల‌య్య గెట‌ప్‌ని మ‌రో ప‌క్క వుంచి 60 ఇయ‌ర్స్ హ్యాపీ బ‌ర్త్‌డే నంద‌మూరి బాల‌క‌ష్ణ అని డిజైన్ చేసి ఇరు ప‌క్క‌ల ల‌య‌న్ సింబ‌ల్స్‌తో డిజైన్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

ఇదే రోజు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ని కూడా రిలీజ్ చేయ‌బోతున్నారు. బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రాన్ని మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. బాల‌య్య అఘోరా క‌నిపించ‌నున్న ఈ చిత్రానికి `మోనార్క్` అనే టైటిల్‌ని చిత్ర బృందం ఫైన‌ల్ చేయ‌బోతోంది.