బాల‌కృష్ణ – బోయ‌పాటి మూవీ టైటిల్ ఫైన‌ల్‌?

 

Balakrishna Boyapati film title as Dharma
Balakrishna Boyapati film title as Dharma

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా మాస్ మ‌సాలా యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింహా, లెజెండ్ వంటి హిట్ చిత్రాల త‌రువాత బాల‌య్య – బోయ‌పాటిల‌ క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడ‌వ చిత్ర‌మిది. బాల‌కృష్ణ పుట్టిన రోజున ఈ చిత్రానికి సంబంధించిన `బీబీ3 ఫ‌స్ట్ రోర్‌` ని రిలీజ్ చేశారు.

దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ట్రేడ్ వ‌ర్గాల్లో ఈ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా వుంటే మేక‌ర్స్ ఇటీవ‌ల ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని కూడా ప్ర‌క‌టించేశారు. ఈ ఏడాది మే 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఇంత వ‌ర‌కు ఈ మూవీ టైటిల్‌ని మాత్రం ప్ర‌క‌టించ‌డం లేదు. దీంతో ఈ మూవీ టైటిల్‌పై ప‌లు వార్త‌లు షికారు చేయ‌డం మొద‌లైంది.

బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రంలోని ఓ పాత్ర‌లో బాల‌య్య ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇదిలా వుంటే తాజాగా ఈ చిత్రానికి `ధ‌ర్మా` అనే టైటిల్‌ని ద‌ర్శ‌కుడు బొయ‌పాటి శ్రీ‌ను ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌. ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.