మోక్షజ్ఞ డెబ్యూను కన్ఫర్మ్ చేసిన బాలయ్య

మోక్షజ్ఞ డెబ్యూను కన్ఫర్మ్ చేసిన బాలయ్య
మోక్షజ్ఞ డెబ్యూను కన్ఫర్మ్ చేసిన బాలయ్య

నిన్న నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును వైభవంగా జరుపుకున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా తన ఫ్యాన్స్ ను ఇంటి వద్దకు రావొద్దని చెప్పారు బాలకృష్ణ. ప్రతీ ఏడాది లానే బసవతారకమ్మ ఆసుపత్రిలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా అఖండ స్పెషల్ పోస్టర్ తో పాటు తన 107వ చిత్రం గురించి అధికారిక సమాచారం వచ్చిన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి సమాచారం ఇచ్చాడు.

మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ తో డెబ్యూ చేస్తాడని తెలిపాడు. ఈ సినిమాలో తామిద్దరం నటిస్తున్నట్లు, అయితే తండ్రీ కొడుకుల పాత్రలు మాత్రం కాదని తెలిపాడు. ఆదిత్య 369 సీక్వెల్ స్క్రిప్ట్ ను తాను రాసానని, దాన్ని సింగీతం శ్రీనివాస రావు, సత్యానంద్ కలిసి ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం చేసారని తెలిపాడు. ఈ చిత్రాన్ని అయితే సింగీతం లేదా తాను డైరెక్ట్ చేస్తామని, త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఉంటుందని లారిటీ ఇచ్చాడు.