కుమిలిపోతున్న బాలకృష్ణ


Balakrishna disappointed with NTR biopic

నాన్నగారి బయోపిక్ తో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తెలుగోడి సత్తా చూపించాలని ఆశపడ్డాడు బాలయ్య కానీ అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్లుగా తయారయ్యింది ఎన్టీఆర్ బయోపిక్ పరిస్థితి . చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా దారుణమైన పరాజయాలను రెండు పార్ట్ లు చవిచూశాయి . ఎన్టీఆర్ కథానాయకుడు కాస్త బెటర్ ఎందుకంటే ఆ సినిమా కనీసం 20 కోట్ల షేర్ అయినా రాబట్టింది , ఇక రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు అయితే మరీ దారుణం 4 కోట్ల షేర్ కూడా వసూల్ చేయలేదు .

 

ఎన్నో ఆశలతో చేసిన ఎన్టీఆర్ బయోపిక్ దారుణమైన ఫలితాన్ని ఇవ్వడంతో బాలయ్య కుమిలిపోతున్నాడు . ముఖంలో సంతోషం లేదు పైగా అవమాన భారంగా ఉంది . మహానటి బయోపిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది ,  యాత్ర పేరుతో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చేస్తే అది కూడా ఫరవాలేదు కానీ ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం ఘోర పరాజయం పొందడంతో బాలయ్య ఎవరికీ ముఖం చూపించలేక పోతున్నాడట అవమాన భారంతో .

English Title: Balakrishna disappointed with NTR biopic