రంజాన్ సంద‌ర్భంగా బాల‌య్య స్పెష‌ల్ వీడియో


రంజాన్ సంద‌ర్భంగా బాల‌య్య స్పెష‌ల్ వీడియో
రంజాన్ సంద‌ర్భంగా బాల‌య్య స్పెష‌ల్ వీడియో

నంద‌మూరి బాల‌కృష్ణ మ్లీ లైన్‌లోకి వ‌చ్చారు. ఈ రోజు రంజాన్ సంద‌ర్భంగా ముస్లీం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆయ‌న మాట్లా‌డుతూ `ముస్లీమ్ సోద‌రుల‌కు హృద‌య‌పూర్వ‌క రంజాన్ శుభాకాంక్ష‌లు. ప్రేమ‌, త్యాగాల‌కు ప్ర‌తీక రంజాన్‌. మీరు లాక్‌డౌన్‌లో కూడా మ‌నో ధైర్యంతో వుంటూ క‌ఠోర ఉప‌వాస దీక్ష‌లు చేశారన్నారు.

ప్రార్థ‌న‌లు ఫ‌లించి క‌రోనా మ‌హ‌మ్మారి త్వ‌ర‌లోనే అంతం కావాల‌ని కోరుకుంటున్నా.అంతా త‌మ త‌మ ఇళ్ళ‌ల్లోనే వుండి రంజాన్ ప్రార్థ‌న‌లు చేసుకోవాలి. స‌మ‌స్త మాన‌వాళి బాగుండేలా ఈద్ అంద‌రి జీవితాల్లో సుఖ సంతోషాల్ని నింపాల‌ని వేడుకుంటున్నాను. స‌మాజంలోని జాలీ,  క‌రుణ‌, సేవాత‌త్ప‌ర‌త, స‌హృద్భావానికి ప్ర‌తీక ఈ పండుగ‌.  క‌రోనా మ‌హ‌మ్మారి విసురుతున్న స‌వాళ్ల నేప‌థ్యంలో ప్ర‌తీ ఒక్క‌రు ఇళ్ల‌లోనే వుంటూ సుర‌క్షిత దూరాన్ని పాటిస్తూ ఈ ఈద్‌ను జ‌రుపుకోవాలి` అన్నారు.

బాల‌కృష్ణ ఇటీవ‌లే ఓ భారీ చిత్రాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్త‌యింది. కీల‌క ఓమోష‌న‌ల్ స‌న్నివేశాల‌తో పాటు ఛేజింగ్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. త‌దుప‌రి షెడ్యూల్ జూన్ లేదా జూలైలో మొద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.