కేకులతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాలయ్య అభిమానులు


కేకులతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాలయ్య అభిమానులు
కేకులతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాలయ్య అభిమానులు

నందమూరి బాలకృష్ణ జూన్ 10న తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెల్సిందే. కరోనా ప్రభావం కారణంగా అభిమానులెవరూ తన పుట్టినరోజు సందర్భంగా కలిసి ఫంక్షన్ లు చేయడాలు, భారీగా సెలెబ్రేట్ చేసుకోవడాలు వంటివి చేయవద్దని బాలయ్య ముందే చెప్పారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హంగామా భారీగానే జరిగింది. వరల్డ్ వైడ్ గా బాలయ్య పుట్టినరోజు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడంతో పాటు ఇప్పుడు అరుదైన రికార్డును కూడా బాలయ్య అభిమానులు తమ ఖాతాలో వేసుకున్నారు.

ఒక సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఎక్కువ కేకులు కట్ చేసిన ఘనత బాలయ్య పుట్టినరోజుకు దక్కింది. జూన్ 10న ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 21 వేల కేకులను కట్ చేశారట. ఇది పాత రికార్డును అధిగమించడంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఈ ఘనతను ధృవీకరించారు. ఈ మేరకు సర్టిఫికెట్లు కూడా త్వరలోనే అందనున్నాయి. ఈ ఘనత పట్ల బాలయ్య కూడా స్పందించారు. తన అభిమానులను అభినందించారు.