బాలయ్య గెటప్ కి విశేష స్పందన


balakrishna getup in ntr goes viralనందమూరి బాలకృష్ణ తాజాగా నటించనున్న చిత్రం ” ఎన్టీఆర్బయోపిక్ లోని బాలయ్య గెటప్ ని నిన్న సాయంత్రం విడుదల చేయగా దానికి విశేషంగా స్పందన వస్తోంది . ఎన్టీఆర్ మనదేశం చిత్రంతో పరిచయమయ్యాడు , దాంతో ఆ సినిమాలోని పోలీస్ గెటప్ లో ఉన్న బాలయ్య గెటప్ ని విడుదల చేసారు . బాలయ్య ఎన్టీఆర్ లుక్ లో బాగున్నాడు దాంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ గెటప్ .

బాలయ్య సరసన బాలీవుడ్ భామ విద్యా బాలన్ నటించనుంది , ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలయ్య కూడా ఒక నిర్మాత కావడం విశేషం . ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు బాలయ్య . మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ , అక్కినేని పాత్రలో అక్కినేని మనవడు సుమంత్ నటించనున్నాడు .

2019 జనవరి 9న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రిలీజ్ డేట్ ముందే డిసైడ్ చేసుకోవడంతో శరవేగంగా నిర్మాణ పనులు కానున్నాయి . ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు కాగా ఈ చిత్రంలో బాలయ్య 60 గెటప్ లలో కనిపించనుండటం విశేషం .

English Title: balakrishna getup in ntr goes viral