బోయ‌పాటికి బాల‌య్య ఫుల్ ఫ్రీడ‌మ్‌!


బోయ‌పాటికి బాల‌య్య ఫుల్ ఫ్రీడ‌మ్‌!
బోయ‌పాటికి బాల‌య్య ఫుల్ ఫ్రీడ‌మ్‌!

కొన్ని కాంబినేష‌న్‌ల‌లో సినిమా అంటే ఆ క్రేజే వేరుగా వుంటుంది. వారిద్ద‌రు క‌లిసి సినిమా చేస్తున్నార‌న‌గానే అభిమానుల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ క్రేజ్ ఏర్ప‌డుతుంటుంది. అలాంటి క్రేజే బోయ‌పాటి శ్రీ‌ను, నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్‌కు వుంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సింహా,లెజెండ్ వంటి చిత్రాలొచ్చాయి. ఈ రెండు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి ఈ ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేయ‌బోతున్నారు.

మిరియాల రవీంద‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `విన‌య విధేయ రామ‌` ఫ్లాప్ కావ‌డంతో బోయ‌పాటి శ్రీ‌నుపై వత్తిడి మొద‌లైంది. దీంతో ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవాల‌ని క‌సిగా బోయ‌పాటి వ‌ర్క్ చేస్తున్నారు. దీని కోసం బ‌డ్జెట్ ప‌రంగా కూడా వెనుకాడ‌టం లేద‌ట‌.  ఇందులో బాల‌య్య రెండు విభిన్న‌మైన గెట‌ప్‌ల‌లో క‌నిపించ‌బోతున్నారు. అందులో ఒక‌టి అఘోరా పాత్ర‌. బాల‌య్య ఏంటీ? అఘోరా పాత్ర చేయ‌డం ఏంట‌ని అంతా అవాక్క‌వుతున్నారు.

త్వ‌ర‌లో వార‌ణాసిలో ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. `రూల‌ర్‌` ఫ్లాప్ కావ‌డంతో బోయ‌పాటికి ఈ సినిమా విష‌యంలో బాల‌య్య ఫుల్ ఫ్రీడ‌మ్ ఇచ్చేశార‌ట‌. క‌థ‌ని మార్చే విష‌యంలో బోయ‌పాటిదే ఫైన‌ల్ నిర్ణ‌య‌మ‌ని చెప్పేయ‌డంతో త‌న‌కు అనుకున్న మార్పుల్ని బోయ‌పాటి పూర్తి చేసి చిత్రాన్ని కొత్త‌గా డిజైన్ చేసిన‌ట్టు చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి.