గోన గ‌న్నారెడ్డి బ‌యోపిక్ లో బాల‌య్య‌?


గోన గ‌న్నారెడ్డి బ‌యోపిక్ లో బాల‌య్య‌?
గోన గ‌న్నారెడ్డి బ‌యోపిక్ లో బాల‌య్య‌?

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌‌క‌త్వంలో బాల‌కృష్ణ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి అత్యంత బారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వీరి క‌ల‌యిక‌లో రెండు చిత్రాలు వ‌చ్చాయి. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల త‌రువాత ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి బాల‌కృష్ణ – బోయ‌పాటి క‌ల‌య‌కలో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఈ మూవీపై బారీ అంచానాలు నెల‌కొన్నాయి.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ రోర్ సినిమాపై మ‌రింత‌గా అంచ‌నాల్ని పెంచేసింది. గ‌త ఏడు నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. త్వ‌ర‌లో ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే బాల‌కృష్ణ ఓ బ‌యోపిక్‌లో న‌టించ‌నున్నార‌ని తెల‌సింది. గోన గ‌న్నారెడ్డి జీవిత క‌థ ఆధారంగా బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

ఇప్ప‌టికే బాల‌య్య‌ను సంప్ర‌దించార‌ట‌. చారిత్ర‌క పాత్ర‌ల‌పై బాల‌కృష్ణ ఆస‌క్తిని చూపిస్తారు కాబ‌ట్టి వెంట‌నే ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లో దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని తెలిసింది. అంతే కాకుండా ఈ చారిత్ర‌క చిత్రాన్ని క్రేజీ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రు తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం.