యంగ్ హీరో సినిమాలో బాలయ్య నటించనున్నాడా?

యంగ్ హీరో సినిమాలో బాలయ్య నటించనున్నాడా?
యంగ్ హీరో సినిమాలో బాలయ్య నటించనున్నాడా?

నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలకు పెట్టింది పేరు. అయితే బాలయ్య వేరే హీరోల చిత్రాల్లో పాత్రలు చేయడం చాలా అరుదు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం బాలకృష్ణ ఒక యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ బాలకృష్ణతో గతంలో చాలా సినిమాలను నిర్మించాడు.

ఈయన ప్రస్తుతం యంగ్ హీరో నాగ శౌర్యతో సినిమాను నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక నూతన దర్శకుడు చెప్పిన కథకు నాగ శౌర్య ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ చేత కీలక పాత్ర చేయించాలని భావిస్తున్నారు. గతంలో మంచు మనోజ్ చిత్రం ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలో బాలయ్య నటించిన విషయం తెల్సిందే. అయితే ఆ చిత్రం ప్లాప్ అయింది. మరి నాగ శౌర్యతో నటించడానికి బాలయ్య ఊ కొడతాడా అన్నది వేచి చూడాలి.

ప్రస్తుతం నాగ శౌర్య మూడు సినిమాలతో బిజీగా ఉండగా, బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది.