అరడజనుకు పైగా ప్రాజెక్ట్స్ తో బాలయ్య బిజీ బిజీ

 

balakrishna lines up half a dozen projects
balakrishna lines up half a dozen projects

నందమూరి బాలకృష్ణ వరసగా ప్లాప్స్ కొట్టినా కానీ ఇప్పుడు భారీ డిమాండ్ లో ఉన్నాడు. సరిగ్గా ప్లాన్ చేసి సినిమా తీస్తే బాలయ్య మాస్ అప్పీల్ కు సినిమా రేంజ్ అమాంతం పెరుగుతుంది. పైగా బాలయ్యతో సినిమా అంటే తక్కువ రోజుల్లో ఫినిష్ చేయొచ్చు. రెమ్యునరేషన్ కూడా ఆకాశాన్ని అంటే రేంజ్ లో అయితే ఉండదు. ఈ కారణాలతో బాలకృష్ణతో సినిమా చేయడానికి నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చిత్రాన్ని చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదలవుతుంది. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అలాగే అనిల్ రావిపూడితో చిత్రాన్ని కూడా ఓకే చేసాడు బాలకృష్ణ. షైన్ స్క్రీన్ సినిమాస్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుంది.

వీరు కాకుండా దిల్ రాజు, సి కళ్యాణ్ లు బాలయ్యకు అడ్వాన్స్ లు ఇచ్చి ఉన్నారు. అలాగే అనిల్ సుంకర, నిరంజన్ రెడ్డిలు బాలకృష్ణతో సినిమా కోసం ట్రై చేస్తున్నారు. మరి వీటిలో ఎన్ని వర్కౌట్ అవుతాయో చూడాలి.