విద్యాబాలన్ ని పెళ్ళిచేసుకున్న బాలకృష్ణ


Balakrishna married vidyabalan

విద్యాబాలన్ ని పెళ్ళి చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ . బాలీవుడ్ హాట్ భామ విద్యాబాలన్ ని బాలయ్య పెళ్ళి చేసుకోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? సినిమా పెళ్ళి అండి . ఈ ఇద్దరూ తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే . బాలయ్య ఎన్టీఆర్ గా నటిస్తుండగా విద్యాబాలన్ బసవతారకం గా నటిస్తోంది . కాగా తాజాగా బాలయ్య – విద్యాబాలన్ పెళ్ళి చేసుకున్న సన్నివేశాలు చిత్రీకరించారట దర్శకులు క్రిష్ . అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగేవో అచ్చం గా అలాగే సెట్ వేసి చిత్రీకరించారట క్రిష్ . అలాగే విద్యాబాలన్ , రానా , నందమూరి కళ్యాణ్ రామ్ లపై కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారట .

రానా చిన్నల్లుడు నారా చంద్రబాబు నాయుడు గా నటిస్తుండగా , కళ్యాణ్ రామ్ నందమూరి హరికృష్ణ గా నటిస్తున్నాడు . ఇప్పటికే ఒక్కో రకంగా ఒక్కొక్కరి గెటప్ రివీల్ చేయడంతో ఎన్టీఆర్ బయోపిక్ కు ఏనలేని క్రేజ్ వచ్చింది . ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు .2019 జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని, జనవరి 24 న ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title : Balakrishna married vidyabalan