బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 107వ చిత్ర అనౌన్స్మెంట్!

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 107వ చిత్ర అనౌన్స్మెంట్!
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 107వ చిత్ర అనౌన్స్మెంట్!

నందమూరి బాలకృష్ణ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 61వ ఏట అడుగుపెడుతున్న బాలయ్య ప్రస్తుతం 106వ చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చిత్రాన్ని చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.

ఇదిలా ఉంటే బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 107వ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. ముందు నుండీ ప్రచారం జరుగుతున్నట్లుగానే క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య వర్క్ చేయనున్నాడు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.

అనౌన్స్మెంట్ వీడియోలో బాలయ్య మార్క్ సింహాన్ని మెయిన్ గా ఫోకస్ చేసారు. హంట్ స్టార్ట్స్ సూన్ అని ప్రకటించారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడు. బాలయ్య ప్రస్తుత సినిమా అఖండ, గోపీచంద్ మలినేని లాస్ట్ చిత్రం క్రాక్ కు కూడా థమన్ సంగీతం అందించడం విశేషం.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలుస్తాయి.