గెటప్ మార్చిన బాలయ్య !


Balakrishna
Balakrishna

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా గెటప్ మార్చాడు . జుట్టు కాస్త తగ్గించి పైకి దువ్వి కింద గడ్డం ని చైనా వాళ్ళ లాగా పెంచిన తీరుతో బాలయ్య కొత్తగా కనిపిస్తున్నాడు . అయితే ఈ గెటప్ బాలయ్య నటించే కొత్త సినిమా కోసం అని తెలుస్తోంది . తాజాగా దర్శకులు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా షూటింగ్ కోసం బాలయ్య ఇలా మారినట్లు తెలుస్తోంది .

ఇంతకుముందు బాలయ్య – కే ఎస్ రవికుమార్ ల కాంబినేషన్ లో సి . కళ్యాణ్ నిర్మించిన జై సింహా అంతగా ఆడలేదు , తిరిగి మళ్ళీ అదే కాంబినేషన్ లో సినిమా రూపొందుతోంది . మరి ఈ సినిమా అయినా ఆడుతుందా ? ఎన్టీఆర్ బయోపిక్ అని తీస్తే ప్రేక్షకులు దారుణంగా తిప్పి కొట్టారు దాంతో బాలయ్య ఖంగుతిన్నాడు . మరి ఈ సినిమా ఏమౌతుందో !