బాల‌య్య కొత్త గెట‌ప్‌కు సిద్ధ‌మ‌వుతున్నారే!


Balakrishna new look for boyapati srinu's film
Balakrishna new look for boyapati srinu’s film

నంద‌మూరి బాల‌కృష్ణ గ‌త కొంత కాలంగా త‌న ప‌ట్టుని కోల్పోతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న చేసిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆధారంగా తీసిన ఎన్టీఆర్ క‌థ‌నాయ‌కడు, మ‌హానాయ‌కుడు ఎల వ‌చ్చాయో అలాగే వెళ్లిపోయాయి. ఆ త‌రువాత చేసిన `రూల‌ర్‌` కూడా పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోయింది.

దీంతో ఈ ద‌ఫా చేసే సినిమాతో బంప‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవాల‌ని బాల‌య్య గ‌ట్టిగా ఫిక్స‌య్యార‌ట‌. `రూల‌ర్‌` త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ ఓ భారీ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని మిరియాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే షూటింగ్ మొద‌లైంది. తొలి షెడ్యూల్‌లో ఓ యాక్ష‌న్ సీన్‌తో పాటు ఎమోష‌న‌ల్ సీన్స్‌ని బోయ‌పాటి పూర్తి చేసినట్టు ఇటీవ‌లే ఫేస్‌బుక్ వేదిక‌గా వెల్ల‌డించారు.

తాజా షెడ్యూల్‌ని ప్రారంభించాల‌నుకున్న స‌మ‌యంలో క‌రోనా ప్ర‌భావం మొద‌ల‌వ్వ‌డంతో షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా వాయిదా వేసిన‌ట్టు తెలిసింది. ఇదిలా వుంటే ఇందులోని బాల‌య్య అఘోరాగా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న గెట‌ప్ కూడా కొత్త‌గా వుంటుంద‌ని చెబుతున్నారు. తాజాగా న‌గ‌రానికి చెందిన సంధ్యా హోట‌ల్స్ అధినేత నూత‌న గృహ ప్ర‌వేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ ఫొటోల్లో బోయ‌పాటి సినిమా కోసం బాల‌య్య కొత్త గెట‌ప్లో సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.