బాలకృష్ణ “రైతు” ప్రాజెక్ట్ ని “రూలర్” గా మార్చారా.?బాలకృష్ణ “రైతు” ప్రాజెక్ట్ ని “రూలర్” గా మార్చారా.?
బాలకృష్ణ “రైతు” ప్రాజెక్ట్ ని “రూలర్” గా మార్చారా.?

నటరత్న ఎన్టీఆర్ గారు సినిమాలు చెయ్యడమే కాకుండా, ఆరోజుల్లో తనకంటూ ఒక క్రియేటివ్ టీం ఏర్పాటు చేసుకుని కథలు తయారు చేయించే వారు. తనకున్న ఆలోచనలను ఎప్పటికప్పుడు వారితో పంచుకంటూ, కథలు, సినిమాలు, టెక్నాలజీ ఇలా అన్నిటిలో ల్యాండ్ మార్క్ లాంటి ఎన్నో సినిమాలు మనకు అందించారు ఆ మహానుభావుడు. ఆయన నట వారసుడు నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా, ప్రస్తుతం సినిమాలు చేస్తూ, స్వయంగా కొన్ని ప్రాజెక్టులు సిద్దం చేస్తున్నారు. గతంలో ఒకసారి బాలయ్య బాబు “నర్తనశాల” వంటి భారీ ప్రాజెక్ట్ కి స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నారు. అయితే కొన్నికారణాల వల్ల ఆ ప్రాజెక్టు తాత్కాలికంగా వాయిదా పడింది. పౌరాణికం కాకుండా సోషియో ఫాంటసీ జోనర్ లో కూడా ఆదిత్య 999 లాంటి సబ్జెక్టు బాలయ్య మనసులో ఉంది.

ఇక రీసెంట్ గా బాలకృష్ణ రైతుల సమస్యలు మరియు రైతుల గొప్పదనం నేపధ్యంలో “రైతు” అనే ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేసి సినిమాగా తీద్దాం అనుకున్నారు. దర్శకుడు గా “కృష్ణ వంశీ” ఫైనల్ అయినట్లు వార్తలు వచ్చాయి. స్వయంగా బాలకృష్ణ ముంబై వెళ్లి, ఇండియన్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కి కథ చెప్పి, అందులో ఒక ప్రదానమైన పాత్ర చెయ్యమని అడగటం, అందుకు ఆయన సమ్మతించడం జరిగాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అయితే రైతుల సమస్యల నేపధ్యంలో కొంచెం సారూప్యత ఉన్న రూలర్ అనే సినిమా చేసిన బాలయ్య; ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మళ్ళీ “రైతు” ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. దీనితో త్వరలో ఆ సినిమా ఉండబోతోంది అని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్లు అయ్యింది.

మరి రాబోయే కొత్త సంవత్సరంలో అయినా, బాలకృష్ణ మనల్ని ఆ సినిమాతో అలరించాలని ఆశిద్దాం .