త‌న‌యుడి ఎంట్రీకి బాల‌య్య ఏం చేస్తున్నారు?


Balakrishna preparing socio fantasy script for mokshagna
Balakrishna preparing socio fantasy script for mokshagna

హీరో నంద‌మూరి బాల‌కృష్ణ త‌న వార‌సుడు మోక్ష‌జ్ఞ‌ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సీనియ‌ర్ ద‌ర్శ‌కులు సింగీతం శ్రీ‌నివాస‌రావు రెడీ చేసిన `ఆదిత్య 999` ద్వారా మోక్ష‌జ్ఞ‌ని ప‌రిచ‌యం చేయాల‌ని ముందు ప్లాన్ చేశారు. కానీ స్క్రిప్ట్ అనుకున్న స్థాయిలో రాక‌పోవ‌డంతో ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు. `ఆదిత్య 369`కు సీక్వెల్‌గా చేయాల‌నుకున్న `ఆదిత్య 999` స్టోరీ విష‌యంలో బాల‌య్య‌కు అనుమానాలు వుండ‌టం వ‌ల్లే ఆ క‌థ‌ని ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టేశారు.

ఆ త‌రువాత మోక్ష‌జ్ఞ‌ని డైరెక్ట్ క్రిష్ ప‌రిచ‌యం చేస్తార‌ని కొంత కాలం.. లేదు లేదు బోయ‌పాటి శ్రీ‌ను ప‌రిచ‌యం చేయ‌బోతున్నార‌ని కొంత కాలం వార్త‌లు షికారు చేశాయి. మోక్ష‌జ్ఞ ఇప్పికీ సినిమాల్లో ఎంట్రీకి సిద్ధం కాలేద‌ని కొంఒత మంది ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం చేశారు. అయితే తాజాగా మోక్ష‌జ్ఞ ఎంట్రీ చిత్రంపై మ‌రో వార్త  ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. త‌న‌యుడి ఎంట్రీ కోసం బాల‌య్యే స్వ‌యంగా క‌థ సిద్ధం చేస్తున్నార‌ని, ఇదొక సోషియో ఫాంట‌సీ అని, క‌థ పూర్తి కాగానే ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది వెల్ల‌డిస్తార‌ని చెబుతున్నారు.

ఇక అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌పైకి రానున్న ఈ చిత్రాన్ని వారాహి చల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే భారీగా బ‌రువు పెరిగిన మోక్ష‌జ్ఞ‌ని బ‌రువు త‌గ్గ‌మ‌ని, అత‌ని కోసం ప్ర‌త్యేకంగా ఓ ట్రైన‌ర్‌ని ఏర్పాటు చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ సారైనా మోక్ష‌జ్క్ష ఎంట్రీ సినిమా వుంటుందా? ఈ వార్త‌లు నిజ‌మేనా అన్న‌ది తెలియాలంటే బాల‌య్య ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.