నందమూరి టోనీ స్టార్క్ డైట్ సీక్రెట్ ఇదే…

నందమూరి టోనీ స్టార్క్ డైట్ సీక్రెట్ ఇదే...
నందమూరి టోనీ స్టార్క్ డైట్ సీక్రెట్ ఇదే…

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “రూలర్.” రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్ అన్నీ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసాయి. ఇక ఈ సినిమాలో అందరూ మాట్లాడుకుంటున్నది బాలయ్య బాబు గెటప్స్ గురించి, ఈ సినిమాలో తన పాత్ర మొత్తం 3 కోణాలలో సాగుతుంది అని బాలకృష్ణ ప్రకటించారు. ఒకటి ఇన్స్పెక్టర్ అయితే మరొకటి నాగలి ధరించిన రైతు పాత్ర. అయితే అందరినీ ఆకర్షిస్తున్నది మాత్రం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ క్యారెక్టర్.

ఈ గెటప్ లో బాలయ్యను చూసిన అభిమానులు అయితే టాలీవుడ్ టోనీ స్టార్క్ అని తెగ సంబరపడిపోతున్నారు. ఈ వైవిధ్యం కోసం బాలకృష్ణ కేవలం 3 నెలలలో 13 కిలోలు తగ్గి సూపర్ స్లిమ్ అయిపోయారు. అయితే దీనికోసం స్పెషల్ డైట్ తీసుకుని రోజుకి ఉదయం 3 గంటలు, సాయంత్రం షూటింగ్ అయ్యాక 2 గంటలు ఎక్సర్ సైజ్ లు చేసారు బాలకృష్ణ. పాత్రలో పరకాయ ప్రేవేశం చేసి, అసాధ్యాలను సుసాధ్యం చెయ్యడం ఆయనకే సాధ్యం. ఇక అందరికీ ఏకగ్రీవంగా నచ్చిన ఆ క్యారెక్టర్ గురించి అడుగుతుంటే, అది ఒకసారి ఒక అభిమాని తనకు ఎందుకో టోనీ స్టార్క్ ఫోటో పంపాడని, ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ గెటప్ అనుకోకుండా అలా సెట్ అయిందని, మొత్తానికి ఈ సినిమా కోసం నందమూరి టోనీ స్టార్క్ గా మారిపోయానని బాలకృష్ణ రూలర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో వెల్లడించారు.