అమితాబ్ కోసం బాలయ్య సినిమానే వదిలేసుకున్నాడుగా


అమితాబ్ కోసం బాలయ్య సినిమానే వదిలేసుకున్నాడుగా
అమితాబ్ కోసం బాలయ్య సినిమానే వదిలేసుకున్నాడుగా

సాధారణంగా నందమూరి బాలకృష్ణను చూస్తే ఎవరినీ పెద్ద లెక్క చేయనట్లు కనిపిస్తాడు. అంటే నెగటివ్ గా కాదు కానీ డేరింగ్ అండ్ డాషింగ్ అనే భావన కలిగిస్తాడు. అయితే ఒక నటుడు అందులోనూ 5 నుండి 10 నిమిషాలు మాత్రమే ఉండే పాత్ర చేయను అన్నాడని తెలిసి ఆ ప్రాజెక్టుని ఆపేసాడు బాలయ్య. ఒకసారి ఆ విషయాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ హీరోగా, క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ రైతుల కష్టాల నేపథ్యంలో రైతు అనే స్టోరీ సిద్ధం చేసుకుని వెళ్లి వినిపించాడు. బాలయ్య కూడా ఆ కథకు ఇంప్రెస్ అయ్యాడు. అయితే ఈ కథలో ఒక 10 నిముషాలు పాటు రాష్ట్రపతి పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్ర కోసం అమితాబ్ అయితేనే సరిపోతాడని బాలయ్య భావించాడు. అతను ఒప్పుకుంటేనే ఈ సినిమా ఉంటుందని ముందే కృష్ణవంశీకి చెప్పాడు.

అప్పట్లో బాలకృష్ణ, కృష్ణ వంశీ అమితాబ్ ను కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసారు. అయితే కారణాలు బయటకు రాలేదు కానీ అమితాబ్ మాత్రం ఈ సినిమా చేయలేనని చెప్పేసాడు. అమితాబ్ తప్పితే వేరే వాళ్ళు ఈ పాత్ర చేయలేరు అంటూ బాలయ్య అన్న మాట ప్రకారంగానే ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేశాడు. రీసెంట్ గా రూలర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రైతు కథ ప్రస్తావన వచ్చినప్పుడు ఇక ఆ ప్రాజెక్ట్ ఉండబోదు అన్నట్లుగా మాట్లాడాడు. రైతు కథ తనకెంతో నచ్చిందని, కచ్చితంగా సినిమా చేయాలనుకున్నానని, అయితే ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఒక సూపర్ స్టార్ ను అనుకున్నామని కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేనని చెప్పేసాడని, దాంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాల్సి వచ్చిందని అన్నాడు బాలకృష్ణ.

ఈ మాత్రం దానికే సినిమా పక్కన పెట్టేయాలా అనిపించొచ్చు. కానీ బాలయ్య తరహానే అంత. పాత్రకు తగ్గ నటీనటులు దొరక్కపోతే తాను సినిమాలు చేయలేనని చెప్పుకొచ్చాడు బాలయ్య. తన స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమా చేద్దామనుకున్నామని, అయితే అప్పుడే సౌందర్య చనిపోవడంతో ఇక ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నాడు.

ఇదంతా బానే ఉంది కానీ, సైరాలో అతి చిన్న పాత్ర వేయడానికి ఒప్పుకున్న అమితాబ్, రైతు విషయంలో మాత్రం బిజీ షెడ్యూల్ అని చెప్పడమేంటో. వారం రోజుల కాల్ షీట్స్ తో అయిపోయే ఈ చిత్రానికి నో చెప్పడానికి వేరే కారణాలు ఉండుండాలి.