హిపోక్ర‌సీ, సైకోఫాన్సీలు ఇక్క‌డ ఎక్కువ – బాలకృష్ణ‌

హిపోక్ర‌సీ, సైకోఫాన్సీలు ఇక్క‌డ ఎక్కువ - బాలకృష్ణ‌
హిపోక్ర‌సీ, సైకోఫాన్సీలు ఇక్క‌డ ఎక్కువ – బాలకృష్ణ‌

బాల‌య్య మ‌ళ్లీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల  ఇండ‌స్ట్రీ వ‌ర్గాలంతా క‌లిసి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌తో స‌మావేశం కావ‌డంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి ప్ర‌కంప‌ణ‌లు సృష్టించిన బాల‌య్య మ‌రోసారి అదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మీటింగ్‌ల‌కు త‌న‌ని పిలవ‌లేద‌ని, అంతా త‌ల‌సానితో క‌లిసి భూములు పంచుకుంటున్నారా? అని బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు దుమారం సృష్టించాయి. వీటి వేడి త‌గ్గ‌క‌ముందే బాల‌య్య మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇండ‌స్ట్రీపై, తెలంగాణ ప్ర‌భుత్వంపై కూడా విమ‌ర్శ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. `మా` బిల్డింగ్ కోసం చిరంజీవిగారు అంతా క‌లిసి అమెరికా వెళ్లి షోలు చేశారు. న‌న్ను పిల‌వ‌లేదు. 5 కోట్లు వ‌చ్చాయ‌న్నారు. ఏమైంది ఆ డ‌బ్బు. బిల్డింగ్ క‌ట్టారా? అంటే అదీ లేదు. ప్ర‌భుత్వం స‌పోర్ట్‌గా వుంది. బిల్డింగ్ కోసం రెండు, మూడు ఎక‌రాలు అడిగితే ఇవ్వ‌రా?.. ఇండ‌స్ట్రీ నుంచి ఎంత ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నారు?. క‌రోనాని ప‌క్క‌న పెట్టి షూటింగ్‌లు మొద‌లుపెట్టాల‌ని ఎందుకు ఆరాటం?. కార‌ణం ట్యాక్స్‌లు. డ‌బ్బు. ఈ సొసైటీలో అత్య‌ధికంగా ట్యాక్స్ పే చేసేది మా ఇండ‌స్ట్రీనే. ఇంత వ‌ర‌కు భ‌వ‌నం క‌ట్ట‌లేదు. మ‌ద్రాస్‌లో చూడండి మేం క‌ట్టుకోలేమా?

ముందు 5 కోట్లు వ‌చ్చాయ‌న్నారు. ఆ త‌రువాత కోటి మాత్ర‌మే అంటున్నారు. మ‌రి 4 కోట్లు ఏమ‌య్యాయి? ఏటీ ఇవ‌న్నీ, నేనేమైనా లెక్క‌ల మాస్ట‌‌ర్నా.. నాకెందుకీ త‌ల‌నొప్పి.. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు వీటి గురించి ప‌ట్టించుకోలేదు. హిపోక్ర‌సీ, సైకోఫాన్సీలు ఇక్క‌డ ఎక్కువ. మైకులు చూడ‌గానే పిచ్చెక్కుతుంది కొంద‌రికి` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బాల‌య్య‌.