న‌న్ను వేరుగా చూస్తే మాత్రం తిక్క‌రేగుద్దీ!

ఛీ ఛీ నేను మాడ్లాడ‌ట‌మేంటి!
ఛీ ఛీ నేను మాడ్లాడ‌ట‌మేంటి!

లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త మూడు నెల‌లుగా షూటింగ్‌లు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. ఇది ఇలాగే క‌న‌సాగితే వేలాది మంది సినీ కార్మికులు రోడ్డున‌ప‌డే ప్ర‌మాదం వుంద‌ని మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ని స‌మావేశ ప‌రిచి తెలంగాణ ప్ర‌భుత్వంతో గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మీటింగ్ ల‌కు త‌న‌ని పిల‌వ‌లేద‌ని, అంతా త‌ల‌సానితో క‌లిసి హైద‌రాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? అని హీరో బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో పెను దుమారాన్ని రేపాయి.

దీనికి కౌంట‌ర్‌గా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా బాల‌కృష్ణ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడొద్ద‌ని, కొంచెం నోటిని అదుపులో పెట్టుకోమ‌ని హెచ్చ‌రించారు. భూముల కోస‌మే తెలంగాణ ప్ర‌భుత్వ మంత్రి త‌ల‌సానితో స‌మావేశం అవుతున్నార‌ని చేసిన వ్యాఖ్య‌ల్ని వెంట‌నే వెన‌క్కి తీసుకుని తెలంగాణ ప్ర‌భుత్వానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అయితే నాగ‌బాబు వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డానికి బాల‌కృష్ణ ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఛీ ఛీ నాగ‌బాబు వ్యాఖ్య‌ల‌పై నేను మాట్లాడ‌టం ఏంటీ? అని ఎదురుప్ర‌శ్నిస్తున్నారు. ఇండ‌స్ట్రీ అంతా నాకు స‌పోర్ట్‌గా నిల‌బ‌డింది. ఇలాంటి స‌మ‌యంలో నేం మాట్లాడ‌తాను. అన్నారు.

అయితే నాగబాబు మీరు భూముల గురించి మాట్లాడార‌ని విమ‌ర్శించారు. దీనిపై మీ స‌మాధానం? అంటే మాత్రం బాల‌య్య సైలెంట్ అయిపోవ‌డం, దిక్కులు చూడ‌టం గ‌మ‌నార్హం. ఇక తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మిమ్మ‌ల్ని పిల‌వ‌ద్ద‌ని చెప్ప‌డం వ‌ల్లే మిమ్మ‌ల్ని పిల‌వ‌లేదంటారా? అలా అని నేను అన‌ను. ఆ అవ‌స‌రం ఆయ‌న‌కు లేదు. కేసీఆర్ మా నాన్న‌కు అభిమాని, నేనంటే ఆయ‌న‌కు పుత్ర వాత్స‌ల్యం వుంది. అలాంట‌ప్పుడు ఆయ‌నే న‌న్ను పిల‌వొద్ద‌ని చెప్పారంటే నేను న‌మ్మ‌ను` అన్నారు బాల‌కృష్ణ‌