బాల‌య్య భీష్ముడి లుక్‌.. ఫొటోలు వైర‌ల్‌!

బాల‌య్య భీష్ముడి లుక్‌.. ఫొటోలు వైర‌ల్‌!
బాల‌య్య భీష్ముడి లుక్‌.. ఫొటోలు వైర‌ల్‌!

మాస్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు పౌరాణిక పాత్ర‌ల్లో త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో ఆక‌ట్టుకోగ‌ల ఏకైక న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఎన్టీఆర్ న‌ట‌వార‌సుడిగా నేటి త‌రం న‌టుల్లో పౌరాణిక పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన హీరో ఆయ‌న‌. గుక్క తిప్పుకోకుండా డైలాగ్‌లు చెప్ప‌డంలోనూ ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. భీష్మ ఏకాద‌శి సందర్భంగా మంగ‌ళ‌వారం అరుదైన చిత్రాల‌ను బాల‌కృష్ణ అభిమానుల‌తో పంచుకున్నారు.

తండ్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తారాక‌రామారావు జీవిత క‌థ ఆధారంగా బాల‌కృష్ణ ఎన్టీఆర్ క‌థానాయకుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. సినీ జీవితంలో త‌న తండ్రి ఎన్టీఆర్ పోషించిన పాత్ర‌ల్ని ఈ చిత్రాల్లో బాల‌కృష్ణ పోషించారు. అలా పోషించిన పాత్ర‌ల్లో భీష్ముడి పాత్ర ఒక‌టి. ఈ పాత్ర‌కు సంబంధించిన స్టిల్స్‌ని బాల‌కృష్ణ అభిమానుల‌తో పంచుకున్నారు.

`భీష్మ పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం. నాన్న‌గారు ఆయ‌న వ‌య‌సుకు మించిన పాత్ర పోషించి ప్రేక్ష‌కుల చేత విశేష ఆద‌ర‌ణ పొందారు. అందుకే నేను `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు`లో భీష్ముడిగా కొన్ని స‌న్నివేశాలు చేశాను. అయితే నిడివి కార‌ణంగా వాటిని తొలగించాల్సి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం భీష్మ ఏకాద‌శి ప‌ర్వ‌దిన్ం సంద‌ర్భంగా పాత్ర‌కు సంబంధించిన ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకుంటున్నా` అని సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్ని ఫొటోల‌ని షేర్ చేశారు బాల‌కృష్ణ‌.