ఆ మీటింగ్‌కు బాల‌య్య వెళ‌తారా?ఆ మీటింగ్‌కు బాల‌య్య వెళ‌తారా?
ఆ మీటింగ్‌కు బాల‌య్య వెళ‌తారా?

షూటింగ్‌లు పునః ప్రారంభించాల‌ని, థియేట‌ర్లు రీ ఓపెన్ చేయాల‌ని కోరుతూ చిరంజీవి అధ్య‌క్ష‌త‌న టాలీవుడ్ ప్ర‌ముఖులు అంతా క‌లిసి తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌తో ఇటీవ‌ల వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హించారు. ఆ త‌రువాత రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కావ‌డం, దానికి త‌న‌ని ఆహ్వానించ‌లేద‌ని బాల‌య్య చేసిన‌ వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో పెను దుమారం సృష్టించాయి.

ఇదిలా వుంటే ఈ నెల 9న అంటే బాల‌య్య పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్. ‌జ‌గ‌న్‌మోహ‌న్‌‌రెడ్డితో  టాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌త్యేకంగా స‌మావేశం కాబోతున్నారు. ఇంత కాలం త‌న‌ని పిల‌వ‌లేద‌ని విమ‌ర్శ‌లు చేసిన బాల‌య్య మ‌రి ఈ మీటింగ్‌కి వెళ‌తారా? ల‌ఏదా అన్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. చిరంజీవి నేతృత్వంలో నిర్మాత‌లు, పంపిణీదారులు ఏపీ ముఖ్య‌మంత్రితో స‌మావేశం కానున్నారు.

ఈ సంద‌ర్భంగా సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ ` సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశానికి బాల‌కృష్ణ‌ను కూడా ఆహ్వానించామ‌ని, పుట్టిన రోజు వేడుక‌ల కార‌ణంగా త‌ను హాజ‌రు కాలేన‌ని బాల‌య్య ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌లు, చిత్రీక‌ర‌ణ అనుమ‌తుల‌పై చ‌ర్చించ‌నున్నామ‌ని పేర్కొన్నారు.